Ntr: 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల తేదీ వాయిదాపడే అవకాశం?

- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- అనుకోకుండా జరుగుతోన్న జాప్యం
- విడుదల తేదీపై తర్జన భర్జనలు
రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు తక్కువనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
