siddaramaiah: రాజ్యాంగం జోలికొచ్చారో.. జాగ్రత్త: బీజేపీకి సిద్ధరామయ్య వార్నింగ్

  • అదే జరిగితే దేశంలో రక్తపాతం జరుగుతుంది
  • బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు
  • అందుకనే శాసనసభలో మీడియాపై నిషేధం

బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిక్కమగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం జోలికెళ్తే దేశంలో రక్తపాతం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యంతో పనిలేదన్న సిద్ధరామయ్య.. అందుకనే శాసనసభలో మీడియాపై నిషేధం విధించారని మండిపడ్డారు. సభలో ప్రతిపక్షాల వాదనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి నిషేధాలు విధిస్తోందన్నారు. మీడియా నిర్బంధంతో బీజేపీ అసలు రంగు బయటపడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాలను సైతం మీడియా బహిష్కరించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్న ఆయన ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలని హితవు పలికారు.  

siddaramaiah
Karnataka
BJP
  • Loading...

More Telugu News