Rajanikant: మరోసారి హిమాలయాల్లోకి వెళ్లిపోయిన రజనీకాంత్!

  • పూర్తయిన దర్బార్ షూటింగ్
  • డెహ్రాడూన్ బయలుదేరిన సూపర్ స్టార్
  • కొన్నాళ్లు అక్కడే మకాం

తన సినిమా షూటింగ్ పూర్తయితే రజనీకాంత్, హిమాలయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు గడిపి వస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న 'దర్బార్'కు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తి కాగానే ఆయన ఉత్తరాఖండ్ కు వెళ్లిపోయారు. చెన్నై నుంచి ఆయన డెహ్రాడూన్ కు విమానంలో బయలుదేరారు. అక్కడి నుంచి కారులో పర్యటిస్తూ కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలను రజనీకాంత్ సందర్శించనున్నారు. ఆపై తాను ప్రత్యక్ష దైవంగా భావించే బాబా గుహకు వెళ్లి ధ్యానం చేసి, తిరిగి చెన్నై చేరుకుంటారని తెలుస్తోంది. ఆ తరువాతే 'దర్బార్' డబ్బింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో రజనీ పాల్గొంటారని సమాచారం.

Rajanikant
Dsrbar
Himalayas
Tour
  • Loading...

More Telugu News