killi kruparani: ఏపీని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే జగన్ ధ్యేయం: నోరు జారిన వైసీపీ నేత

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • తప్పును గుర్తించని కృపారాణి
  • గతంలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా..

కేంద్రమాజీ మంత్రి, వైసీపీ నేత కిల్లి కృపారాణి నోరు జారారు. నిన్న ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. అది విన్న నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన తప్పును గుర్తించని కృపారాణి మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పుడామె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైసీపీ నేతలు ఇలా నోరు జారడం ఇదే తొలిసారి కాదు.. ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కూడా ఓసారి ఇలానే నోరు జారారు. వాసిరెడ్డి పద్మ ఇటీవల ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రోజా మాట్లాడుతూ.. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో తెలియక వైసీపీ నేతలు అయోమయానికి గురయ్యారు.


killi kruparani
YSRCP
Jagan
RK Roja
Andhra Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News