Ranga Reddy District: హయత్ నగర్ వద్ద ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం!

  • అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు
  • కూలిన విద్యుత్ స్తంభం..వాహనచోదకుడికి గాయాలు
  • మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్

కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ అద్దె బస్సులను పలు రూట్లలో నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఓ రూట్ లో తిరుగుతున్న అద్దె బస్సు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని భాగ్యలత ప్రాంతం సమీపంలో అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు డివైడర్ మీదుగా దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో అది కూలిపోయింది. ఆపై ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Ranga Reddy District
Hayatnagar
Rtc
Accident
  • Loading...

More Telugu News