Andhra Pradesh: బీసీల గొప్పతనాన్ని చెప్పేందుకే వాల్మీకి జయంతి: ఏపీ స్పీకర్ తమ్మినేని

  • బీసీలు దద్దమ్మలు కాదు
  • వాళ్లు బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ
  • బీసీల అభ్యున్నతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం

బీసీలు దద్దమ్మలు కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అని, వారి గొప్పతనాన్ని తెలియజేసేందుకే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్టు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, రామాయణం సామాజిక నీతిని బోధిస్తుందని, మహాభారతం లౌక్యం నేర్పిస్తుందని అన్నారు. దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్ వేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని, బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు.

Andhra Pradesh
assembly
speaker
Tammineni
  • Loading...

More Telugu News