Valmiki Maharshi: వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నాం: చంద్రబాబునాయుడు

  • గొప్పదనం అనేది పుట్టుకలో ఉండేది కాదు
  • మనం చేసిన పనులే గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయి
  • ఆధునిక సమాజానికీ మార్గనిర్దేశనం చేసిన మహర్షి వాల్మీకి

వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. గొప్పదనం అనేది పుట్టుకలో ఉండేది కాదని, జీవితంలో మనం చేసిన పనులే మనల్ని గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయన్న విషయాన్ని వాల్మీకి చరిత్ర చెబుతుందని అన్నారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి చక్కగా విశదీకరించి, ఆధునిక సమాజానికి కూడా మార్గనిర్దేశనం చేసిన ఆయనకు మనందరం రుణపడి ఉన్నామని అన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని అన్నారు. ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపి, ప్రజారంజక పాలన చేసి మహనీయుడైన శ్రీరామచంద్రుని చరిత్రను  రామాయణ మహాకావ్యంగా మలచి మనకు అందించిన  మహానుభావుడు, ఆదికవి వాల్మీకి అని కొనియాడారు.

Valmiki Maharshi
Chandrababu
Naidu
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News