India: ఓటమి దిశగా దక్షిణాఫ్రికా.. భారత బౌలర్ల ధాటికి క్యూ కడుతున్న సఫారీలు

  • రెండో ఇన్నింగ్స్ లో 79 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా
  • అశ్విన్ ఖాతాలో మరో రెండు వికెట్లు
  • ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉన్న సౌతాఫ్రికా

పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఓటమి దిశగా అడుగులేస్తోంది. టీమిండియా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 79 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మార్క్ రాం కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని ఇశాంత్ శర్మ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మరో ఓపెనర్ ఎల్గర్ భారత బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ... 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత డిబ్రుయిన్ (8), డుప్లెసిస్ (5), డీకాక్ (5) లు వెనువెంటనే ఔట్ అయ్యారు. ప్రస్తుతం బవుమా, ముత్తుసామి క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా, ఇశాంత్, ఉమేశ్ యాదవ్, జడేజాలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు. ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News