KCR: కేసీఆర్ పెంపుడు కుక్క 'హస్కీ' మృతి కేసు వివరాలను ఇవ్వలేం: పోలీసులు

  • గత నెలలో మృతి చెందిన హస్కీ
  • ఆర్టీఐ చట్టం కింద కేసు వివరాలను ఇవ్వాలని కోరిన శ్రీనివాసరావు అనే వ్యక్తి
  • కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఇవ్వలేమన్న పోలీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఆయన పెంపుడు కుక్క 'హస్కీ' గత నెలలో మరణించింది. ఈ ఘటనలో డాక్టర్ రంజిత్ పై పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను ఇవ్వాలంటూ గంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులను కోరారు. అయితే, ఫిర్యాదు నకళ్లు కానీ, ఎఫ్ఐఆర్ కాపీని కాని ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున వివరాలను ఇవ్వలేమని చెప్పారు. విచారణకు భంగం కలిగే అవకాశం ఉందని తెలిపారు.

KCR
TRS
Pet Dog
  • Loading...

More Telugu News