Telugudesam: ఎన్నారై ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసిన వర్ల రామయ్య

  • అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపణ
  • తక్షణమే ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • 49 ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదని వెల్లడి

టీడీపీ నేత వర్ల రామయ్య గుంటూరు అర్బన్ ఎస్పీని కలిశారు. టీడీపీ నేతలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న ఎన్నారై ప్రభాకర్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. 49 ఫిర్యాదులు ఇచ్చినా ఇంతవరకు స్పందన లేదని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతకొంతకాలంగా టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులపై ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తీవ్రంగా స్పందించారు. తమపై వైసీపీ వాళ్లు అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Telugudesam
YSRCP
Varla Ramaiah
Police
Chandrababu
  • Loading...

More Telugu News