Aravind: ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్ ను ప్రజలు డిస్మిస్ చేయాలి: బీజేపీ ఎంపీ అరవింద్
- హుజూర్ నగర్ ఉపఎన్నికలపై అరవింద్ స్పందన
- హుజూర్ నగర్ కు టీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీలేదని విమర్శలు
- సెలవు పెట్టి సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేశారంటూ మండిపాటు
తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా హుజూర్ నగర్ ఉపఎన్నికలపై స్పందించారు. హుజూర్ నగర్ కు టీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఏటా నియోజకవర్గానికి రావాల్సిన రూ.130 కోట్లను ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సెలవు పెట్టి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేశారని మండిపడ్డారు. డిస్మిస్ చేయాల్సింది ఆర్టీసీ కార్మికులను కాదని, ఆరేళ్లుగా సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ ను ప్రజలే డిస్మిస్ చేయాలని అన్నారు.