ESI: ఈఎస్ఐ స్కాంలో ట్విస్టు... కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్లు కూడా మింగేశారు!

  • ప్రతి ఏటా కార్మికుల కోసం కేంద్రం నిధులు విడుదల
  • రూ.100 కోట్లు గల్లంతైనట్టు అనుమానాలు
  • ఆరా తీస్తున్న కేంద్ర కార్మిక శాఖ

హైదరాబాద్ ఈఎస్ఐలో వెలుగు చూసిన కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తే కోట్ల విలువ చేసే కుంభకోణంలో ప్రధానపాత్రధారి కాగా, కిందిస్థాయి ఉద్యోగులు కూడా పాపంలో పాలుపంచుకున్నారు. మందుల కొనుగోలులో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు వెనకేసుకున్నారు.

ఇక ఇప్పుడీ కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్లు కూడా గల్లంతైనట్టు గుర్తించారు. ప్రతి ఏడాది కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది. ఈ వంద కోట్లకు సంబంధించి స్పష్టమైన వివరాలు లేకపోవడంతో వీటిని కూడా స్వాహా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రూ.100 కోట్ల గోల్ మాల్ పై కేంద్ర కార్మిక శాఖ ఆరా తీస్తుండడమే అందుకు నిదర్శనం.

  • Loading...

More Telugu News