Chandrababu: చంద్రబాబు వద్ద హీరోయిజం ఉందా? ఆయనేమైనా శోభన్ బాబా?: గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు

  • చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
  • చంద్రబాబుకు మతిపోయిందన్న అమర్ నాథ్
  • వెన్నుపోటు రాజకీయాలంటూ వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్ పాలన చూసి చంద్రబాబుకు మతిపోయినట్టుందని, లేక మత్తులో ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడో తెలియడంలేదని విమర్శించారు. తనకు తెలిసినంతవరకు చంద్రబాబుకు మందు అలవాటు లేదని, ఒకవేళ అధికారం పోయాక ఆయనకు మందు అలవాటైందేమోనని అన్నారు.

ఇటీవల చంద్రబాబు విశాఖలో పర్యటించిన సందర్భంగా వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. చంద్రబాబు విశాఖ వస్తే తనకోసం లక్షల మంది స్వాగతం పలకడానికి వచ్చినట్టు ఫీలైపోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ తో ఫొటోలు దిగడానికి వచ్చారంటే ఓ అర్థం ఉందని, కానీ చంద్రబాబు కోసం అంతమంది రావడానికి ఆయన వద్ద అందం ఉందా? హీరోయిజం ఉందా? లేక ఆయనేమైనా శోభన్ బాబా? అంటూ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు తన ఇంట్లోవాళ్లకు శోభన్ బాబులా కనిపిస్తారేమో కానీ తమకు కాదని, కనీసం చంద్రబాబు మాటల్లో కూడా అందం ఉండదని అన్నారు. వెన్నుపోట్లు, మేనేజ్ మెంట్ రాజకీయాలు తప్ప చంద్రబాబు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

Chandrababu
Telugudesam
Gudivada Amarnath
YSRCP
Vizag
  • Loading...

More Telugu News