Mahesh Babu: విదేశాల నుంచి వస్తూ.. ఫ్లయిట్ లో నుంచి మహేశ్ బాబు ట్వీట్!

- 'సరిలేరు నీకెవ్వరు' షూటింగుకి బ్రేక్
- భార్యాబిడ్డలతో అక్కడే సందడి
- దసరా సెలవులు పూర్తికావడంతో తిరుగు ప్రయాణం
విదేశాల్లో విహరించడమంటే మహేశ్ బాబుకి ఎంతో ఇష్టం. అందువల్లనే ఆయన ప్రతి సినిమాకి ముందు .. ఆ తరువాత కూడా ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళ్లి వస్తుంటాడు. ఇక పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు షూటింగుకు బ్రేక్ ఇచ్చేసి మరీ ఆయన విదేశాలకి బయల్దేరుతూ ఉంటాడు. అలాగే ఈ సారి దసరా సెలవులకి ఆయన భార్యాబిడ్డలతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాడు. అక్కడ తాము సరదాగా సందడి చేసే ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు.
