Gundeboina Rammurthi Yadav: జానారెడ్డికి తొలిసారి ఓటమి చూపించిన ఘనుడు... మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ కన్నుమూత!

  • 72 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత
  • నల్గొండ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకునిగా పేరు
  • సంతాపం తెలిపిన పలువురు నేతలు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా సీనియర్ నేత గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఈ ఉదయం మరణించారు. నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి విజయం సాధించారాయన. అంతేకాదు... జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్ నేతగా చలామణి అవుతున్న జానారెడ్డికి తొలిసారిగా ఓటమిని రుచిచూపించింది కూడా రామ్మూర్తి యాదవే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

రామ్మూర్తి యాదవ్ అంత్యక్రియలు రేపు ఉదయం స్వగ్రామమైన త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో జరుపుతామని కుటుంబీకులు తెలిపారు. రామ్మూర్తి మరణ వార్తను తెలుసుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

Gundeboina Rammurthi Yadav
Passes Away
Nalgonda
Chalakurthi
Jana Reddy
  • Loading...

More Telugu News