Jagga Reddy: నా దగ్గర డబ్బు లేదు.. కార్యకర్తల వద్ద అప్పులు చేస్తుంటా: జగ్గారెడ్డి

  • అప్పులతోనే రాజకీయాలు చేస్తున్నా 
  • మొత్తం వంద కోట్ల అప్పు వుంది
  • దసరాకే కోటి రూపాయలు ఖర్చయిందన్న జగ్గారెడ్డి

అప్పులే తప్ప, తన వద్ద డబ్బులేమీ లేవని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తన వద్ద చాలా డబ్బుందని అందరూ అనుకుంటూ ఉంటారని, కానీ, కార్యకర్తలు, నాయకులే తనకు అప్పులు ఇస్తుంటారని, ఆ డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. కార్యకర్తల వైద్యానికి, వారి పిల్లల పెళ్లిళ్లకూ చేసే సాయం ఈ డబ్బులతోనేనని అన్నారు. మొత్తం మీద తనకు రూ. 100 కోట్ల వరకూ అప్పులున్నాయని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.

కొండాపూర్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, తాను ఎవరెవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నానో గుర్తుంచుకున్నానని అన్నారు. కొంతమందిని వేదికపైకి పిలిచి, "నీ వద్ద ఎంత తీసుకున్నాను?" అని అడిగి, వారితో సమాధానం చెప్పించారు. మొన్న జరిగిన దసరా పండగకు తాను దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు చేశానని జగ్గారెడ్డి చెప్పడం కొసమెరుపు.

Jagga Reddy
Sangareddy
Congress
  • Loading...

More Telugu News