sai pallavi: గ్రీన్ ఇండియా చాలెంజ్: సాయిపల్లవి సవాలుకు రానా ఓకే!

  • వరుణ్‌తేజ్ చాలెంజ్‌ను స్వీకరించిన సాయిపల్లవి
  • ఇంటి ఆవరణలో మొక్క నాటి సమంత, రానాలకు సవాల్
  • ‘ఓకే బాస్’ అంటూ రిప్లై ఇచ్చిన రానా

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సినీ నటి సాయిపల్లవి విసిరిన చాలెంజ్‌ను నటుడు రానా స్వీకరించాడు. పర్యావరణ పరిరక్షణ కోసం సినీ, రాజకీయ ప్రముఖులు ఇటీవల గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. ఎంపీ సంతోష్ కుమార్, నటుడు అక్కినేని అఖిల్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన మరో నటుడు వరుణ్‌తేజ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి నటి సాయిపల్లవి, తమన్నాలకు చాలెంజ్ విసిరాడు.

వరుణ్‌తేజ్ చాలెంజ్‌ను స్వీకరించిన సాయిపల్లవి ఓ మొక్కను నాటి టాలీవుడ్ నటుడు రానా, నటి సమంతలను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పేర్కొంది. సాయిపల్లవి చాలెంజ్‌ను స్వీకరించిన రానా ‘ఓకే బాస్’ అని రిప్లై ఇచ్చాడు.  

sai pallavi
green india challenge
rana
Tollywood
  • Loading...

More Telugu News