Jinping: చెన్నై చేరుకున్న జిన్ పింగ్ కు ఘన స్వాగతం.. ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కు పయనం

  • రెండు రోజుల పర్యటనకు వచ్చిన జిన్ పింగ్
  • ఘన స్వాగతం పలికిన తమిళనాడు గవర్నర్, సీఎం
  • కాసేపట్లో మహాబలిపురం వెళ్లనున్న జిన్ పింగ్

రెండు రోజుల భారత పర్యటనకు గాను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. ఎయిర్ చైనా విమానంలో చెన్నెకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి... మేళతాళాలు, తమిళనాడు పారంపర్య కళలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు.

 విమానాశ్రయం నుంచి ఆయన చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కు బయల్దేరనున్నారు. మరోవైపు, ఆయన ప్రయాణించే మార్గమంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఘన స్వాగత ఏర్పాట్లను చేశారు. అనంతరం ఇక్కడి నుంచి ఆయన మహాబలిపురం బయల్దేరుతారు. అక్కడ ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. పర్యటనలో భాగంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.

Jinping
China
India Tour
Narendra Modi
  • Loading...

More Telugu News