Kanna: పోలవరంలో ఏం అవినీతి జరిగిందో జగన్ ప్రభుత్వం ఇంత వరకు కనిపెట్టలేకపోయింది: కన్నా లక్ష్మీనారాయణ

  • పోలవరంను గత ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగానే చూసింది
  • అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తే బాగుండేది
  • అవినీతి ఆరోపణలపై కేంద్రానికి నివేదిక అందజేస్తాం

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను ఈరోజు ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపారని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులను ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగానే చూసిందని... సీరియస్ గా పని పూర్తి చేయాలని అనుకోలేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతోందని... ఈ నేపథ్యంలో, పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని అక్కడకు వెళ్తున్నామని కన్నా తెలిపారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... ఆ అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తే బాగుండేదని అన్నారు. పోలవరంలో ఎక్కడ అవినీతి జరిగిందో వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు కనిపెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఎల్లుండి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి... అవినీతి ఆరోపణలపై నివేదికను అందజేస్తామని చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కావాల్సిన పనులను ముఖ్యమంత్రి జగన్ చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.

Kanna
Jagan
Telugudesam
YSRCP
BJP
Polavaram
  • Loading...

More Telugu News