విజయసాయిరెడ్డిపై రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేయనున్న రవిప్రకాశ్
- రవిప్రకాశ్ పై సీజేఐకు లేఖ రాసిన విజయసాయిరెడ్డి
- పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపిన రవిప్రకాశ్ మేనేజర్
- తప్పుడు వార్తలు ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం
రామేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి అనుచరుడు రామారావు లిఖితపూర్వకంగా తమ ఆరోపణలను వివిధ శాఖలకు గత నెలలో పంపించారని... అయితే ఇవన్నీ గాలి ఆరోపణలని అధికారులు తేల్చారని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రామారావు పంపిన లేఖ ప్రతినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని చెప్పారు. వీరు చేసిన నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.