Kollu Ravindra: పోలీసుల కళ్లుగప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర!

  • నేడు మచిలీపట్నంలో టీడీపీ నిరసన
  • కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • ఎలాగోలా బయటకు వచ్చేసిన మాజీ మంత్రి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హాజరు కాకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకోవాలన్న పోలీసుల ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఉదయం నుంచి కొల్లు ఇంటి చుట్టూ పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించగా, వారి కళ్లుగప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొల్లు, నిరసన ప్రాంతానికి చేరుకున్నారు.

ఇంటి వెనుకవైపు నుంచి అవతలి వీధిలోకి వచ్చిన ఆయన, ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వాహనం ద్వారా నగర నడిబొడ్డున ఉన్న కోనేరు సెంటర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసుల తీరును తప్పుబట్టిన ఆయన, శాంతియుతంగా ఆందోళన చేసే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

Kollu Ravindra
Andhra Pradesh
Machilipatna
Sand
  • Loading...

More Telugu News