Krishna District: మచిలీపట్నంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతల హౌస్‌ అరెస్టు!

  • ఎక్కడి వారిని అక్కడే నిర్బంధిస్తున్న పోలీసులు
  • మాజీ మంత్రి కొల్లు ఇంటిని చుట్టుముట్టిన సిబ్బంది
  • కోనేరు సెంటర్‌లో 36 గంటల దీక్ష యోచన నేపథ్యంలో ఘటన

మచిలీపట్నంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక కోనేరు సెంటర్లో 36 గంటల దీక్ష పిలుపు నేపథ్యంలో దాన్ని విఫలం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం నుంచి మచిలీపట్నంలోని తెలుగుదేశం నాయకులను గృహనిర్బంధం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని ఇంటికే పరిమితం చేశారు. అయితే అర్జునుడిని పోలీసులు అరెస్టు చేశారన్న వార్త బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్‌ మొదలయ్యింది.

దీంతో టీడీపీ నాయకులు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఊహాగానాలు నమ్మవద్దని అడిషనల్‌ ఎప్పీ సత్తిబాబు ప్రకటన చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఎవరికీ శిబిరాల ఏర్పాటుకు అనుమతించలేదని, అందువల్ల శాంతిభద్రతల పరిరక్షణకు అంతా సహకరించాలని ఏఎస్పీ కోరారు. డీఆర్పీ సమావేశం ఉన్నందున శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News