Chaitu: శేఖర్ కమ్ముల మూవీ ఈ ఏడాదిలో రానట్టేనట!

  • శేఖర్ కమ్ముల నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • చైతూ సరసన సాయిపల్లవి
  • ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచన 

తెలుగు తెరపై కథాబలంతో కూడిన సినిమాలకు .. సహజత్వానికి దగ్గరగా మలిచిన కథలకు కేరాఫ్ అడ్రెస్ గా శేఖర్ కమ్ముల కనిపిస్తాడు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన కథలను తయారుచేసుకుంటూ ఉంటాడు. అలాంటి శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో కథానాయకుడిగా  చైతూ .. కథానాయికగా సాయిపల్లవి కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా కొన్నిరోజుల క్రితం శేఖర్ కమ్ముల చెప్పాడు. అయితే అనుకున్నట్టుగా ఈ సినిమా పనులు పూర్తికాకపోవడం వలన మరింత ఆలస్యమవుతుందనేది తాజా సమాచారం. డిసెంబర్ నాటికి షూటింగును .. జనవరిలో మిగతా పనులను పూర్తిచేసి, ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.

Chaitu
Sai Pallavi
  • Loading...

More Telugu News