Director: రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు..చంద్రబాబు, లోకేశ్ ట్వీట్లు

  • టాలీవుడ్ గర్వించదగిన దర్శకుడు రాజమౌళి
  • రాజమౌళి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి
  • రాజమౌళి మరెన్నో ఉత్తమ చిత్రాలు తీయాలి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్రరంగం గర్వించదగిన సినీ దర్శకుడు రాజమౌళి అని ప్రశంసించారు. రాజమౌళికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. అదేవిధంగా, టీడీపీ నేత నారా లోకేశ్ కూడా రాజమౌళికి తన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిధిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు, ఆత్మీయుడు రాజమౌళికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేశ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. రాజమౌళి మరెన్నో ఉత్తమమైన చిత్రాలు తీయాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నానని లోకేశ్ పేర్కొన్నారు.

Director
Rajamouli
Chandrababu
lokesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News