Kangana: మరోసారి కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్!

  • జయలలిత బయోపిక్ గా 'తలైవి'
  • దర్శకుడిగా ఏఎల్ విజయ్ 
  • ప్రధాన పాత్రధారిగా కంగనా రనౌత్

రాజకీయాలపై దృష్టి పెట్టిన దగ్గర నుంచి ప్రకాశ్ రాజ్ సినిమాల సంఖ్యను తగ్గించారనే చెప్పాలి. గతంలో కంటే తెలుగు .. తమిళ భాషల్లో ఆయన చేస్తోన్న సినిమాల సంఖ్య బాగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ మూవీ 'తలైవి'లో ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.

జయలలిత బయోపిక్ గా 'తలైవి' సినిమాను దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో జయలలితగా కంగనా రనౌత్ కనిపించనుంది. జయలలిత బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉంటుంది. అందువలన ఆ విషయంపై కంగనా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం . ఇక ఎంజీఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కీలకమైన కరుణానిధి పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇరువర్' (ఇద్దరు) సినిమాలో కరుణానిధి పాత్రలోనే ప్రకాశ్ రాజ్ మెప్పించారు. మరోసారి ఆయన అదే పాత్రలో కనిపించనున్నారన్న మాట.

Kangana
Arvind
Prakash Raj
  • Loading...

More Telugu News