nagarjuna saga dam: భారీ వర్షాల నేపథ్యంలో.. తెరుచుకున్న నాగార్జున సాగర్ జలాశయం గేట్లు
- ఎగువన వర్షాలతో పెరుగుతున్న వరద
- ముందస్తుగా అప్రమత్తమైన అధికారులు
- నిండుకుండలా మారిన జలాశయం
నాగార్జున సాగర్ జలాశయం గేట్లు మరోసారి తెరిచారు. ప్రస్తుతం రిజర్వాయర్ నిండుకుండలా ఉండగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు తరలి వస్తుండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి 1,05,210 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 589.90 అడుగుల ఎత్తున నీరుంది. 212 టీఎంసీ నీటి నిల్వసామర్థ్యానికిగాను 311.74 టీఎంసీల నీరుంది. దీంతో పైనుంచి 96,324 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుండగా, అంతకు కాస్త ఎక్కువ నీటినే దిగువకు విడుదల చేస్తున్నారు.