Sharad Pawar: కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందనే వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందన

  • త్వరలోనే కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందన్న షిండే
  • షిండే వ్యాఖ్యలను ఖండించిన శరద్ పవార్
  • కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం కాదంటూ స్పష్టీకరణ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రచార సభలో కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. షోలాపూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో షిండే మాట్లాడుతూ, త్వరలోనే కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో పెద్ద చర్చకే దారి తీశాయి.

ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందిస్తూ, షిండే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని... ఆయన పార్టీ గురించి ఆయన ఏమైనా చెప్పుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం కాదనే విషయాన్ని తాను స్పష్టంగా చెబుతున్నానని తెలిపారు. దీంతో షిండే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారా? అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. రెండు పార్టీలు కలిస్తేనే బీజేపీని ఎదుర్కోగలమనే ఉద్దేశంతో షిండే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Sharad Pawar
Shindey
Congress
NCP
  • Loading...

More Telugu News