Kapil Dev: విమానంలో చంద్రబాబును చూసి... పక్కన కూర్చుని ముచ్చట్లాడిన కపిల్ దేవ్.. వీడియో ఇదిగో!

  • గుంటూరుకు వచ్చిన కపిల్ దేవ్
  • టెన్త్ టాపర్లకు అవార్డులు
  • తిరుగు ప్రయాణంలో తారసపడ్డ చంద్రబాబు

తాను ప్రయాణిస్తున్న విమానంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును చూసిన లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్, ఆయన పక్కన కూర్చుని కాసేపు ముచ్చట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఓ అవార్డుల బహూకరణ కార్యక్రమానికి వచ్చిన కపిల్ దేవ్, తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరుకుని విమానం ఎక్కారు.

అదే విమానంలో చంద్రబాబు కూడా ప్రయాణిస్తున్నారు. చంద్రబాబును చూసిన కపిల్ దేవ్, ఆయన పక్కన కూర్చుని, కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తాను తీసుకున్న చర్యలను గురించి ఈ సందర్భంగా చంద్రబాబు, కపిల్ కు వెల్లడించారు. కాగా, రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కపిల్ హాజరై, పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి బహుమతులను అందించారు.

Kapil Dev
Chandrababu
Flight
  • Error fetching data: Network response was not ok

More Telugu News