Morning Star: ఈ తెల్లవారుజామున బోల్తా పడిన మార్నింగ్ ట్రావెల్స్ బస్!

  • బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన బస్సు
  • అనంతపురం జిల్లాలో అదుపుతప్పి బోల్తా
  • ఒకరి పరిస్థితి విషమం

బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న మార్నింగ్ స్టార్ బస్సు ఈ తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో బోల్తా పడింది. పామురాయి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుండగా, బస్సులో ప్రయాణిస్తున్న కారుణ్య, శిరీష, అవంతిలకు గాయాలుకాగా, మరొకరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు సమాచారం.

ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, జేసీబీ సాయంతో బస్సును పక్కకు తప్పించారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను స్థానికుల సాయంతో బయటకు తీశారు. పలువురికి స్వల్ప గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.

Morning Star
Bus
Anantapur District
Road Accident
  • Loading...

More Telugu News