kachhuluru: గోదావరిలో పడవ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించాలి: కళా వెంకట్రావు డిమాండ్

  • పడవ ప్రమాదం ఘటనపై ప్రభుత్వం స్పందించట్లేదు
  • ఈ ఘటన జరిగి 23 రోజులు కావస్తోంది
  • ప్రభుత్వం, జగన్ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారు

తూర్పు గోదావరి జిల్లాలోని కచ్చులూరులో ఇటీవల జరిగిన పడవ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ నేత కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదావరిలో పడవ ప్రమాద ఘటన జరిగి ఇన్నిరోజులు కావస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం, ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ ప్రమాద ఘటన జరిగి ఇరవై మూడురోజులు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తగు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రమాదానికి గురైన బోటు నదిలో మూడొందల అడుగుల కింద ఉందని, ముఖ్యమంత్రి మూడు వేల అడుగుల పై నుంచి సర్వే చేసి వచ్చేశారని విమర్శించారు.

kachhuluru
boat
accident
kala venkat rao
  • Loading...

More Telugu News