Imran Khan: పాకిస్థాన్ సినీ నటి, హర్భజన్ ల మధ్య కొనసాగుతున్న ట్వీట్ల యుద్ధం

  • ఇమ్రాన్ ఖాన్ ను విమర్శిస్తూ భజ్జీ ట్వీట్
  • తన ట్వీట్ లో ఒక పదాన్ని తప్పుగా రాసిన వీణామాలిక్
  • ఇంగ్లీష్ లో రాసేటప్పుడు మరోసారి చదువుకో అంటూ భజ్జీ సెటైర్

భారత్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై... పాక్ నటి వీణామాలిక్, టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ల మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. ఇమ్రాన్ వ్యాఖ్యలపై తొలుత హర్భజన్ ట్వీట్ చేశాడు. ఇమ్రాన్ ప్రసంగం ద్వారా భారత్ కు అణుయుద్ధ సంకేతాలు అందుతున్నాయని... ఒక గొప్ప క్రికెటర్ అయిన ఆయన మాటలు రెండు దేశాల మధ్య విద్వేషాలను మరింత పెంచేలా ఉన్నాయని అన్నాడు. ఒక మేటి ఆటగాడైన పాక్ ప్రధాని తన ప్రసంగాలతో శాంతిని నెలకొల్పే విధంగా వ్యవహరించాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.

హర్భజన్ ట్వీట్ పై వీణామాలిక్ స్పందిస్తూ... తమ ప్రధాని శాంతి గురించే మాట్లాడారని... కశ్మీర్ లో కర్ఫ్యూ ఎత్తేస్తే జరగబోయే హింసాత్మక ఘటనల గురించి వివరించారని ట్వీట్ చేసింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మాత్రమే స్పష్టంగా  చెప్పారని పేర్కొంది. అంతేకాదు నీకు ఇంగ్లీష్ అర్థం కాదా? అని హర్భజన్ ను ప్రశ్నించింది. అయితే, ఈ ట్వీట్ లో ఇంగ్లీష్ పదం surelyకి బదులుగా surly అని రాసింది.

వీణామాలిక్ ట్వీట్ పై భజ్జీ సెటైర్ వేశారు. surly అంటే ఏమిటి? అది surelyయేనా? అంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఇంగ్లీష్ లో రాసేటప్పుడు మరోసారి చదువుకో అంటూ సమాధానమిచ్చాడు.

Imran Khan
Harbhajan Singh
Veena Malik
Pakistan
  • Loading...

More Telugu News