Hyderabad: ఇంటిపై పిడుగు.. నివాసితులు బయటకు పరుగులు!

  • హైదరాబాదును నిన్న సాయంత్రం ముంచెత్తిన భారీ వర్షం
  • పిడుగు పడటంతో ధ్వంసమైన ఓ ఇల్లు
  • భయంతో బయటకు పరుగులు తీసిన ఇంట్లోని వ్యక్తులు

హైదరాబాదులో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపించాయి. భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇదే సమయంలో చాదర్ ఘాట్ లోని ఓల్డ్ మలక్ పేట్ రేస్ కోర్స్ సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంలో ఇంట్లోని వారు బయటకు పరుగులు పెట్టారు. అయితే, పిడుగు ధాటికి ఇంటి పైకప్పు, గోడలు బీటలు వారాయి. గోడ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో చుట్టుపక్కల వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. 

Hyderabad
Rain
Thunder
  • Loading...

More Telugu News