Khammam District: పండగ వేళ విషాదం... పిడుగు పడి ముగ్గురు స్నేహితుల మృతి

  • పొలంలోకి వెళ్లగా మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం
  • చెట్టు కింద నిల్చుని ఉండగా దుర్ఘటన
  • ఖమ్మం జిల్లా ముదిగొండలో ఘటన

దసరా పండగ ఉత్సవం రోజు ఆ మూడు కుటుంబాల్లో విషాదం అలముకుంది. పిడుగుపడిన దుర్ఘటనలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోయి తీవ్ర విషాదాన్ని నింపారు.

వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన ఇరుగు శ్రీను (20), బలంతు ప్రవీణ్‌ (19), జి.నవీన్‌ (19), ఉసికెల గోపిలు స్నేహితులు. మంగళవారం సాయంత్రం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. దీంతో స్నేహితులంతా ఓ చెట్టు కిందకు చేరుకున్నారు.

అయితే చెట్టు మీదే పిడుగు పడడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోగా, గోపి తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. గోపిని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలిసింది.  

Khammam District
mudigonda
pidugu
three died
  • Loading...

More Telugu News