Vijayawada: తనను తిట్టిన సీఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు... చర్యలు తీసుకోలేదని వాపోతున్న సహచరులు!

  • తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన సీఐ, కానిస్టేబుల్
  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై విధులు
  • వేధిస్తున్నా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం

దసరా పర్వదినాల సందర్భంగా విధుల నిమిత్తం విజయవాడ ఇంద్రకీలాద్రి వద్దకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ ను సీఐ వేధిస్తుండగా, ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, చర్యలు శూన్యమని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వివరాల్లోకి వెళితే, దసరా ఉత్సవాలకు బందోబస్తు నిమిత్తం తూర్పు గోదావరి నుంచి సీఐ, ఓ మహిళా కానిస్టేబుల్ హాజరయ్యారు. వీరికి ఘాట్ రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద విధులను అప్పగించగా, రెండు రోజుల నుంచి తనను ఆకారణంగా వేధిస్తున్నాడని, బూతులు తిడుతూ ఉన్నారని సదరు కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

 అయితే, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై బాధిత మహిళా కానిస్టేబుల్ సహచరులు ఆందోళన వ్యక్తం చేస్తూ, సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక దసరా ఉత్సవాలు ముగిశాయి కాబట్టి, ఉన్నతాధికారులు ఈ విషయమై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Vijayawada
Indrakeeladri
Harrasment
CI
Lady Conistable
  • Loading...

More Telugu News