state bank of India: ఎస్‌బీఐ దీపావళి నజరానా... క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు బహుమతుల ఆఫర్లు

  • రూ.లక్ష విలువైన హాలిడే ఓచర్‌ గెల్చుకునే అవకాశం
  • ప్రతీ గంటకూ వెయ్యి రూపాయల బహుమానం
  • అక్టోబర్‌ 30వ తేదీ వరకు ఆఫర్‌ చెల్లుబాటు

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సందర్భంగా క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు గంటగంటకూ నగదు బహుమతితోపాటు అత్యధిక మొత్తం ఖర్చు చేసిన వినియోగదారుడికి లక్ష విలువైన ‘మేక్‌ మై ట్రిప్‌' హాలిడే ఓచర్ ను గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది.

వీటితోపాటు రోజు వారీ గిఫ్ట్‌లలో ఏడువేల రూపాయల విలువైన ఇయర్‌ఫోన్స్‌, వారాంతపు గిఫ్ట్‌లలో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్‌ ఫోన్లు గెల్చుకునే అవకాశం ఇస్తోంది. అక్టోబరు 30వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుంది. ఇందుకోసం ఎస్‌బీఐ వివిధ రకాల పెద్ద బ్రాండ్ల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవల ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News