jaheer Khan: 'హహహ... తరువాతి బాల్ గుర్తుందా'... హార్దిక్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన జహీర్ ఖాన్!

  • జహీర్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన హార్దిక్
  • అదే వీడియోను పోస్ట్ చేయడంపై విమర్శలు
  • తరువాతి బంతిని ప్రస్తావించిన జహీర్

రెండు రోజుల క్రితం జహీర్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. "హ్యాపీ బర్త్ డే జాక్. నేను ఇక్కడ కొట్టినట్టు నువ్వు మైదానం బయట కొడతావని అనుకుంటున్నా" అంటూ ఓ టీ-20 పోటీలో జహీర్ బౌలింగ్ లో తాను సిక్సర్ కొట్టిన వీడియోను హార్దిక్ పోస్ట్ చేశాడు.

 ఇక దీనిపై స్పందిన జహీర్, తాజాగా ఓ ట్వీట్ పెడుతూ, ఘాటైన సమాధానం ఇచ్చాడు. "ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీకు ధన్యవాదాలు. నీలా నేను బ్యాటింగ్ చేయలేను. అయితే, ఇదే మ్యాచ్ తరువాతి బంతిలా నేను నా పుట్టిన రోజును బాగా జరుపుకున్నాను" అని అన్నాడు. ఆ మ్యాచ్ లో నెక్ట్స్ బాల్ కు హార్దిక్ అవుట్ కావడం గమనార్హం. ఇదే సమయంలో తన పుట్టిన రోజునాడు విషెస్ చెప్పిన అందరికీ జహీర్ కృతజ్ఞతలు తెలిపాడు.

jaheer Khan
Hardhik Pandya
Birthday
Counter
  • Error fetching data: Network response was not ok

More Telugu News