america: ఆల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ.. వైమానిక దాడుల్లో కీలక నేత హతం

  • ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
  • ఆల్‌ఖైదా కీలక నేత ఆసిం ఉమర్ హతం
  • ఇటీవల బిన్ లాడెన్ కుమారుడిని హతమార్చిన అమెరికా సైన్యం

ఆఫ్ఘనిస్థాన్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి ఉగ్రస్థావరాలపై అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆల్‌ఖైదా కీలక నేత ఆసిం ఉమర్ హతమైనట్టు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, తాము గతంలో నిర్వహించిన దాడుల్లో ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ మృతి చెందిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే, అతడిని ఎప్పుడు హతమార్చిందన్న వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

america
afghanistan
al-qaeda
terrorist
  • Loading...

More Telugu News