annavaram: అన్నవరం లాడ్జీలో హైదరాబాద్ దంపతుల ఆత్మహత్య
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d634d164deea8d4dd39e3331945c7a70749118d7.jpg)
- దంపతులది కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం
- హైదరాబాద్‌లో ట్రావెల్స్ సంస్థను నిర్వహిస్తున్న పవన్
- ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెందిన హైదరాబాద్‌కు చెందిన దంపతులు అన్నవరంలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పవన్.. హైదరాబాద్‌లో పవన్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పవన్‌కు వాటి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపం చెందిన పవన్.. భార్య ధనలక్ష్మితో కలిసి అన్నవరం చేరుకున్నాడు.
అక్కడ ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జీ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.