Nobel: భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్
- పీబుల్, క్యూలోజ్, మేయర్ లకు నోబెల్
- ఫిజిక్స్ లో సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు
- దశాబ్దాల కృషి ఫలితం
ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రపంచప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. నాటి బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఇప్పటివరకు విశ్వం తీరుతెన్నులను మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్థాంతీకరించిన జేమ్స్ పీబుల్ ను నోబెల్ కు ఎంపిక చేశారు. సౌర వ్యవస్థకు ఆవల ఓ సూర్యుడి వంటి నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాన్ని కనుగొన్నందుకు మైకేల్ మేయర్, దిదీయర్ క్యూలోజ్ లను కూడా నోబెల్ ప్రైజ్ వరించింది. నిన్న వైద్యరంగంలో ముగ్గురిని నోబెల్ కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.