UNO: ఐక్యరాజ్యసమితికీ తప్పని నిధుల లేమి!

  • 230 మిలియన్ డాలర్ల లోటుతో కొనసాగుతున్న సమితి
  • అక్టోబరు నెలాఖరుకు ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి
  • లేఖ రాసిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి

ప్రపంచదేశాల మధ్య సమన్వయకర్తగా, గౌరవనీయ వేదికగా కొనసాగుతున్న ఐక్యరాజ్యసమితిని నిధుల లేమి వేధిస్తోంది. అక్టోబరు నెలాఖరు తర్వాత ఐక్యరాజ్య సమితి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే, ఇప్పటికిప్పుడు ఈ ప్రపంచవేదిక వద్ద ఉన్న నిధులు మరో రెండు మూడు వారాలకు మించి సరిపోవు.

ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం 230 మిలియన్ డాలర్ల మేర లోటుతో కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు సభ్య దేశాల నుంచి అందే నిధులే ఆధారం. అయితే ఈసారి సభ్యదేశాల నుంచి 70 శాతం మాత్రమే నిధులు సమకూరాయి. ఖర్చులను నియంత్రించుకోవడానికి సమితి ఇప్పటికే అనేక సదస్సులను వాయిదా వేసుకుంది. కొన్ని రకాల సేవలను కూడా తగ్గించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఓ లేఖలో పేర్కొన్నారు.

UNO
Antonio Guterres
  • Loading...

More Telugu News