Urenium: నెల్లూరు జిల్లాలో యురేనియం నిక్షేపాలు... అన్వేషణకు రంగం సిద్ధం!

  • అనంతసాగరం మండలంలో యురేనియం నిల్వలు!
  • పడమటి కంబంపాడు అటవీప్రాంతంలో తవ్వకాలు  
  • తవ్వకాల ప్రాంతానికి చేరుకున్న యంత్రాలు

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు వద్దంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యమం కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లాలో యురేనియం కలకలం మొదలైంది. నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు భావిస్తున్నారు. పడమటి కంబంపాడు వద్ద అటవీ ప్రాంతంలో అన్వేషణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడికి యంత్ర పరికరాలు కూడా చేరుకున్నాయి. ఆటోమేటిక్ ఎనర్జీ అనే సంస్థ తవ్వకాలను పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.

అయితే యురేనియం అన్వేషణ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమ పొలాలు, తాగునీటి వనరులు దెబ్బతింటాయని అంటున్నారు. నల్లమల తరహాలో ఇది కూడా వివాదాస్పదమవుతుందో లేక కార్యరూపం దాల్చుతుందో వేచిచూడాలి.

Urenium
Nellore District
Andhra Pradesh
  • Loading...

More Telugu News