Anand Mahindra: దసరా నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా ట్వీట్... వైరల్!

  • దాండియా ఆడుతున్న తండ్రీ కూతుళ్లు
  • వీడియో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • మరో ట్వీట్ లో చిన్నారుల దుర్గామాత ఫార్మేషన్

తనకు తారసపడిన, నచ్చిన ఏ విషయాన్ని అయినా వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మరో ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని అంటేలా సాగుతున్న వేళ, ఓ తండ్రి, కుమార్తెలు పోటీ పడి దాండియా ఆడుతున్న వీడియో ఇది.

ఇక ఈ వీడియోకు 'దాండియా డాడీ' పోటీలకు ఇదొక ఎంట్రీనా ఏమిటీ? అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశ్నించారు. "ఇంతకీ వీళ్లిద్దరూ తండ్రీ కూతుళ్ళా? బాగుంది.. అతను బాగానే పోటీ ఇస్తున్నాడు. అయినా నిజం చెప్పాలంటే, ఈ 'దాండియా డాటర్' మాత్రం పోటీల్లో కచ్చితంగా గెలుస్తుంది" అంటూ కామెంట్ పెట్టారు.

ఇదే సమయంలో మరో ట్వీట్ లో నలుగురు చిన్నారులు దుర్గామాత అవతారంలో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఇంతకన్నా అత్యుత్తమమైన మందిరాన్ని, విగ్రహాన్ని తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.

Anand Mahindra
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News