Saina Nehwal: హెల్ప్ చేయండి.. వీసా రావడం లేదు... వాపోయిన సైనా నెహ్వాల్!

  • 15 నుంచి డెన్మార్క్ లో షటిల్ పోటీలు
  • వీసా ప్రాసెస్ కాలేదన్న సైనా నెహ్వాల్
  • కల్పించుకోవాలని ట్విట్టర్ లో వినతి

ప్రముఖ షటిల్ క్రీడాకారిణి, ఎన్నో దేశాల్లో పర్యటించి, భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన సైనా నెహ్వాల్, ఇప్పుడు డెన్మార్క్ లో జరిగే షటిల్ పోటీల్లో పాల్గొనేందుకు వీసా రాక అవస్థలు పడుతోంది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు డెన్మార్క్ లోని ఒడెన్సీలో ఈ పోటీలు జరుగనుండగా, తనకు, తన ట్రయినర్ కు ఇంతవరకూ వీసా రాలేదని సైనా నెహ్వాల్ వాపోయింది.

ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖ, భారత్ లోని డెన్మార్క్ దౌత్య కార్యాలయాలను ట్యాగ్ చేస్తూ, ట్విట్టర్ లో తన గోడును వెళ్లబోసుకుంది. తనకు, తన శిక్షకుడికి వీసా వచ్చేలా చూడాలని కోరింది. వచ్చే వారంలోనే తనకు మ్యాచ్ లు ఉన్నాయని, ఇంతవరకూ వీసా ప్రాసెస్ మొదలు కాలేదని, అధికారులు కల్పించుకోవాలని వ్యాఖ్యానించింది. ఇక సైనా నెహ్వాల్, షటిల్ పోటీలకు వెళ్లేందుకే వీసా రావడం కష్టతరమైందని తెలుసుకున్న అభిమానులు, సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.

Saina Nehwal
Visa
Denmark
Jai Shankar
  • Error fetching data: Network response was not ok

More Telugu News