Jupudi: బ్యాక్ టూ వైసీపీ... నేడు జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న జూపూడి ప్రభాకర్!

  • వైఎస్ అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం
  • నేడు ఆకులతో కలిసి పార్టీలో చేరిక
  • ఎన్నికల తరువాత వైసీపీకి దగ్గరైన జూపూడి

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆపై కొంతకాలం జగన్ తో నడిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర్, తిరిగి సొంతింటికి చేరుకోనున్నారు. నేడు ఆకుల సత్యనారాయణతో కలిసి జగన్ ను కలవనున్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత జూపూడి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన క్రమంగా వైసీపీకి దగ్గరయ్యారు. గతంలో తనకున్న పరిచయాలతో పావులు కదిపిన జూపూడిని పార్టీలోకి తీసుకునేందుకు జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం జూపూడి, ఆకుల జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

Jupudi
YSRCP
Jagan
Akula
  • Loading...

More Telugu News