ESI Scam: ఈఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన ఏసీబీ

  • వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డి అరెస్ట్
  • 2013 నుంచి అక్రమాలకు పాల్పడుతున్న వైనం
  • ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ

తెలంగాణలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డితో పాటు కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం అరెస్ట్ లు 13కు చేరాయి. ఈఎస్ఐ డైరెక్టర్ పద్మతో కలసి అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐకి పరికరాలు సరఫరా చేసినట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. 2013 నుంచి ఈయన అక్రమాలకు పాల్పడుతున్నారు.

ESI Scam
Telangana
  • Loading...

More Telugu News