Rakul Preet Singh: ఓ హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డా: రకుల్ ప్రీత్ సింగ్

  • రొమాన్స్ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడ్డా
  • ఆయన నుంచి వస్తున్న చెమట వాసనను భరించలేకపోయా
  • చివరకు నేనే వెళ్లి పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చా

టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తన కెరీర్ లో వివిధ భాషల్లో ఎంతో మంది హీరోల సరసన నటించింది. అయితే ఒక హీరోతో మాత్రం రకుల్ చాలా ఇబ్బంది పడిందట. సదరు హీరోతో లొకేషన్ లో రొమాన్స్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు... అతని నుంచి వచ్చే చెమట కంపును భరించలేకపోయేదాన్నని రకుల్ తెలిపింది. ఆ విషయాన్ని అతనికి చెప్పేందుకు భయమేసి... చివరకు తానే దూరంగా వెళ్లి పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చానని చెప్పింది. తనను చూసి యూనిట్ లోని చాలా మంది కూడా అలాగే చేశారని తెలిపింది. అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

Rakul Preet Singh
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News