Chandrababu: పేదల పొట్టకొట్టి వైసీపీ నేతల జేబులు నింపే అకృత్యాలు ఇవన్నీ: చంద్రబాబు విమర్శలు

  • ఇసుక కొరత సృష్టించారని ఆరోపణలు
  • పండుగ పూట పేదలను పస్తులుంచుతున్నారని విమర్శలు
  • ట్విట్టర్ లో చంద్రబాబు స్పందన

వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఇంకెన్నాళ్లీ ఇసుక కష్టాలు? అంటూ ట్విట్టర్ లో నిలదీశారు. కావాలని ఇసుక కొరత సృష్టించి లక్షల మంది పేదల పొట్టకొట్టారని, పండుగ వేళ పేద కుటుంబాలు పస్తులుండే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. సరైన ఇసుక విధానం లేకుండా చేసి నిర్మాణ కార్మికులను అప్పుల పాలయ్యేలా చేసి వారికి దసరా ఆనందం లేకుండా చేశారని ఆరోపించారు. పేదల పొట్టకొట్టి వైసీపీ నేతల జేబులు నింపే అకృత్యాలు ఇవన్నీ అంటూ ట్వీట్ చేశారు.

Chandrababu
YSRCP
Jagan
Telugudesam
Andhra Pradesh
Sand
  • Loading...

More Telugu News