Jagan: చంద్రబాబు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు: వైసీపీ నేత జోగి రమేశ్

  • సమాజం తలదించుకునేలా పోస్టింగ్స్ చేయిస్తున్నారు
  • టీడీపీ ఓటమిపాలైనా బాబు తీరు మారలేదు
  • బాబు పెట్టిన మానసిక క్షోభతోనే, ఎన్టీఆర్, కోడెల చనిపోయారు

సీఎం జగన్ కుటుంబంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఖండించారు. ఈ విషయమై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే, ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు చనిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనా చంద్రబాబు తీరు మారలేదని విమర్శలు చేశారు.

Jagan
YSRCP
mla
jogi ramesh
Chandrababu
  • Loading...

More Telugu News