cm: జగన్ కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

  • జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే టీడీపీ పని
  • చంద్రబాబు పాలనలో ఏపీని సంక్షోభంలోకి నెట్టారు
  • నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

సీఎం జగన్ కుటుంబంపై టీడీపీ పోస్టింగ్స్ చూస్తుంటే అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేయించారని, పెయిడ్ ఆర్టిస్ట్ లతో మంత్రులను తిట్టించారని టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలోకి నెట్టారని, కేవలం నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని కొనియాడారు. జగన్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా టీడీపీకి విమర్శించడమే పని అని, అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

cm
jagan
YSRCP
mla
Undavalli
sridevi
  • Loading...

More Telugu News