USA: అమెరికాలో హైదరాబాద్ యువతి ఆత్మహత్య!

  • జూలైలో భర్త వద్దకు వెళ్లిన వనిత
  • ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం
  • భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమెరికాలోని కరోలినా ప్రాంతంలో భర్తతో కలిసి ఉంటున్న హైదరాబాద్ కు చెందిన ఓ యువతి గృహహింసను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, నాగోల్ సమీపంలోని సాయినగర్ కు చెందిన గజం వనిత (38) భర్త రాచకొండ శివకుమార్ వేధింపులకు తాళలేక కొంతకాలం క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆపై గత జూలైలో భర్త వద్దకు వెళ్లిపోయింది. రెండు నెలల నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేయలేదు.

ఈ క్రమంలో ఆదివారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో, ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది. వనిత మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని వారు వేడుకుంటున్నారు. ఘటన తరువాత నార్త్ కరోలినా పోలీసులు శివకుమార్ ను అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు.

USA
Hyderabad
Vanita
Sucide
North Karolina
Police
  • Loading...

More Telugu News